వైసీపీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ.. కేవలం 21 ఓట్ల స్వల్ప తేడాతో విజయం

by Mahesh |
వైసీపీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ.. కేవలం 21 ఓట్ల స్వల్ప తేడాతో విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి కరువు శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ ఫలితాల్లో శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ కు 122 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 25 ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైసీపీ అభ్యర్థి కరువు శ్రీనివాస్ 21 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఇది రెండో విజయం.

Next Story

Most Viewed