మహోగ్రరూపం దాల్చిన కపిలతీర్ధం... భక్తులకు నో ఎంట్రీ!

by Naresh N |
మహోగ్రరూపం దాల్చిన కపిలతీర్ధం... భక్తులకు నో ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : గత వారం రోజులుగా మిచౌంగ్ తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విశాఖ జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉన్నది. పక్క రాష్ట్రం తమిళనాడులోనూ మిచౌంగ్ విరుచుకుపడుతోంది. ఈ ఎఫెక్ట్ తిరుపతి జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అలిపిరి, శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిల తీర్థం జలపాతం నీటి పరవళ్లతో తొనికీసలాడుతోంది. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు ప్రజలు, భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు. అయితే ఈ పుణ్య క్షేత్రాల సమీపంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కారిణిల్లో భక్తుల స్నానాలకు ఆలయ అధికారులు అనుమతించడం లేదు.Next Story

Most Viewed