శ్రీశైలానికి తరలి వస్తున్న కన్నడ భక్తులు

by Disha Web Desk 5 |
శ్రీశైలానికి తరలి వస్తున్న కన్నడ భక్తులు
X

దిశ, శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో కన్నడ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్దసంఖ్యలో పాదయాత్రగా వస్తున్నారు. ఎండలు సైతం లెక్కచేయకుండా కర్ణాటక. మహారాష్ట్ర నుంచి భక్తులు నల్లమల్ల అడవుల గుండా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. బేలూటీ, నగులూటీ, భీముని కొలను మీదుగా నల్లమల కొండల్లో కఠోరమైన పాదయాత్ర సాగిస్తున్నారు. మార్గమధ్య అడవుల్లోనే భక్తులు సేద తీరుతున్నారు. కైలాస ద్వారం, హటకేశ్వరం, సాక్షిగణపతి వద్ద భక్తులకు అన్నదానం, అల్పాహారం అందజేస్తున్నారు. కన్నడ యువకులు కాళ్లకు చకలు కట్టుకుని కాలినడకన వస్తూ ఆకట్టుకుంటున్నారు. దర్శనం ముగిసిన తరువాత భక్తులు తమ ప్రాంతాలకు తిరుగుముఖం పడుతున్నారు. రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో కన్నడ భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది.



Next Story

Most Viewed