- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Kakinada : వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. !
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. కొద్దీ రోజులగా ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలను నిజం చేస్తూ జనసేనలోకి జంప్ అయిపోవాలని ఆయన డిసైడ్ చేసుకున్నారు. జనసేన పార్టీలో చేరబోతున్నాని తన కార్యకర్తలకు దొరబాబు క్లారిటీ కూడా ఇచ్చారట. రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు దొరబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా.. మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా వైసీపీని వీడబోతున్నారు. వీరంతా బుధవారం రోజు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెండెం దొరబాబు వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయనకు కాకుండా వంగా గీతకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అప్పటి నుండి దొరబాబు వైసీపీపై కోపంతో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.ఎన్నికల ముందు దొరబాబుకు వైసీపీ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చి తరువాత మాట తప్పింది. దీంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో దొరబాబు బుధవారం జనసేనలో చేరబోతున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు. కాగా పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బరిలోకి దిగి 70 వేలకు పైగా మెజారిటీతో వంగా గీతపై అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.