చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించని జూ.ఎన్టీఆర్ : అచ్చెన్నాయుడు ఏమన్నారంటే!

by Disha Web Desk 21 |
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించని జూ.ఎన్టీఆర్ : అచ్చెన్నాయుడు ఏమన్నారంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌లపై టాలీవుడ్ స్పందిస్తోంది. ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, నట్టికుమార్‌తోపాటు పలువురు నటులు స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు. అంతేకాదు రజినీకాంత్ సైతం స్పందించారు. అయితే చంద్రబాబు అల్లుడు, నందమూరి తారక రామారావు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదితర పరిణామాలు జరుగుతున్నప్పుడు తారక్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కనీసం ట్వీట్ కూడా చేయలేదు. గురువారం కుటుంబంతో కలిసి తారక్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తారక్ స్పందించకపోవడంపై టీడీపీ మండిపడుతుంది. ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్ వంటి అంశాలపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదో ఆయననే అడగాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు అన్న ప్రశ్నకు అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. తాము ఎవరినీ స్పందించమని కోరడం లేదని.. వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఒకవేళ స్పందించమని అందర్నీ అడిగినట్లైతే... జూనియర్‌ను కూడా అడిగేవాళ్లమంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చారని...తాము ఆర్గనైజ్ చేయలేదని.. అక్కడెవరైనా తెలుగు దేశం వాళ్లు కనిపించారా అని అచ్చెన్నాయుడు మీడియాను ప్రశ్నించారు.

Next Story

Most Viewed