టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. నందిగం సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

by Mahesh |
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. నందిగం సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం (Mangalagiri TDP Office)పై దాడి జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)‌ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్‌ (Hyderabad)లో అరెస్ట్ చేశారు. గతంలో సురేష్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు వెళ్లగా.. పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగి రమేష్(Jogi Ramesh), అవినాశ్ (Avinash) ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ జరిపింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని నందిగం సురేష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న ఏపీ హైకోర్టు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈ నెల 4కు వాయిదా వేసింది. అయితే ఈ రోజు జరిగిన వాదనల్లో.. దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బెయిల్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే మూడేళ్ల క్రితం కేసు నమోదు చేసి పేర్లు ఇప్పుడు నమోదు చేశారని. రాజకీయ కక్షతోనే సురేష్‌పై కేసు నమోదు చేశారని నందిగం సురేష్‌ తరుపు న్యాయవ్యాది కోర్టుకు తెలిపారు. కాగా ఇరువర్గాల వాదనలు పూర్తి కావడంతో ఈ నెల 4న హైకోర్టు తన తీర్పు ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed