జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు: సిఈసీకి పవన్ కల్యాణ్ థ్యాంక్స్

by Seetharam |
Pawan Kalyan, janasena glass symbol
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది.గతంలోనూ గాజు గ్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసింది. అనంతరం ఫ్రీసింబల్స్ జాబితాలో గాజు గ్లాస్‌ను ఉంచింది. అయితే తాజాగా జనసేన పార్టీ సింబల్‌గా గాజు గ్లాస్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి థ్యాంక్స్ చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసినట్లు గుర్తు చేశారు. ఏపీలో 137 స్థానాలు, తెలంగాణలో 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీ చేశారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషం అన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికార యంత్రాంగానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.



Next Story

Most Viewed