మళ్లీ ఆ కంపెనీలకే భూములు.. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 16 |
మళ్లీ ఆ కంపెనీలకే భూములు.. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ‘పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని పదే పదే గొప్పులు చెప్పుకోంది ప్రభుత్వం. క్విడ్ ప్రోకో డీల్స్‌తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న రూ.13 లక్షల కోట్లు ఎంఓయూలు ఏమైయ్యాయి. దుకాణం బంద్ చేసే ముందు క్లియరెన్స్ సేల్ పెట్టి మార్కెటింగ్ చేసినట్లు తమకు అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలతో పని లేకుండా ప్రభుత్వం భూములు కట్టబెట్టింది’. అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల శాఖలో చోటు చేసుకున్న అవకతవకలపై మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణకు స్థిరమైన పాలసీ లేకపోవడంతో నాలుగున్నరేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని, కనీసం రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా లేదని మనోహర్ మండిపడ్డారు.

‘కృష్ణపట్నం అల్ట్రా పవర్ ప్రాజెక్టు కోసం 2680 ఎకరాలు కేటాయిస్తూ అపపటి వైఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొనని కారణాల వల్ల ఆ సంస్థ ప్రాజెక్ట్‌ను సకాలంలో నిర్మించలేకపోయింది. సకాలంలో నిర్మించనందు వల్ల ఆ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసుల ఇవ్వడంతో ప్రాజెక్టు నిర్మించలేదమని తాము బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన రూ 300 కోట్లు తిరిగి ఇచ్చేయాలని 2016 జనవరిలో ప్రభుత్వానికి ఉత్తరం రాసింది.’ అని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

Next Story

Most Viewed