అడ్డంగా బుక్కయిన జగన్.. వీడియో వైరల్

by Disha Web Desk 5 |
అడ్డంగా బుక్కయిన జగన్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ వేడి రోజురోజుకు ఎక్కువ అవుతోంది. సీఎం జగన్ కుప్పంలో వదిలిన నీళ్లపై బటన్ నొక్కి అడ్డంగా బుక్కైన జగన్ అంటూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో జగన్ కుప్పంలో ఉదయం నీళ్లు వదిలాడని, సాయంత్రానికి జగన్ వదిలిన నీళ్లు మాయం అయ్యాయని, తెల్లారక జగన్ నీళ్లు వదలడం కోసం వేసిన సెట్టు కూడా తీసేశారని చెబుతూ.. ఈ క్లిప్పింగులను ఓ సినిమా సన్నివేశానికి జత చేసి పోస్టు చేశారు.

అంతే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కుప్పంలో ఉత్తుత్తి బటన్ నొక్కి అడ్డంగా బుక్కయిన జగన్ మోసపు రెడ్డి, నిన్న హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదులుతున్నట్లు బటన్ నొక్కాడని, నేడు కాలువ గేట్లు కూడా తీసేశారు. నీళ్లేవి జగన్! అని అడుగుతున్న కుప్పం జనానికి ఏం సమాధానం చెబుతాడో? అని రాసుకొచ్చారు. కాగా సీఎం జగన్ కుప్పంలో బటన్ నొక్కి హంద్రీనీవా నీళ్లు విడుదల చేయగా, అవి సాయంత్రానికి రాకుండా పోయాయి. అంతేగాక ఇవ్వాళ ఉదయం ఆ కాలువకు సంబందించిన గేట్లను తీసి, లారీలో తరిలించారు.


Next Story

Most Viewed