సంచలనం: జగన్‌పై దాడి కేసులో కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడేనట?

by Disha Web Desk 21 |
సంచలనం: జగన్‌పై దాడి కేసులో కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడేనట?
X

దిశ, డైనమిక్ బ్యూరో : కోడికత్తి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన దాడికి వాడిన కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావేనని ఆరోపించారు. ఈ మేరకు నిందితుడు జనిపల్లి శ్రీను తరఫు న్యాయవాది సలీం ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ భద్రతా అధికారి దినేష్‌కుమార్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే కత్తిని అందించారంటూ బాంబు పేల్చారు. ఈకేసులో విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే భయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ఐఏ కోర్టు విచారణకు హాజరుకావడం లేదని న్యాయవాది సలీం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్య నారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కారణమని లాయర్‌ సలీం ఆరోపించారు. దాడి జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి కేసులో సాక్షిగా ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్‌కుమార్‌కు మజ్జి శ్రీనివాసరావే అందజేశారని చెప్పుకొచ్చారు. అనంతరం ఈ నేరాన్ని జనిపల్లి శ్రీనుపై నెట్టారని న్యాయవాది సలీం ఆరోపించారు.

రావాలి జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోడికత్తి కేసులో కావాలనే విచారణకు హాజరుకావడం లేదని నిందితుడు జనిపల్లి శ్రీను తరఫు న్యాయవాది సలీం ఆరోపించారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి కేసు విచారణను విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయిన తర్వాత మంగళవారం కేసు విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం సలీం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారంటూ సలీం తెలిపారు. కేసు విచారణ వేగంగా జరగడానికి 'రావాలి జగన్‌.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్‌వోసీ’అనేది తమ వాదన అంటూ సలీం చెప్పుకొచ్చారు. ఈ దాడి కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్‌ఐఏ స్పష్టం చేసిందని అయినప్పటికీ సీఎఎం వైఎస్ జగన్ ఎందుకు విచారణకు హాజరుకావడం లేదో అర్థం కావడం లేదని న్యాయవాది సలీం అన్నారు.వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధిపొందేందుకే ఈ కేసు విచారణను మరింత పెంచుతున్నారంటూ సలీం ఆరోపించారు.

Next Story

Most Viewed