దోపిడీ వ్యవస్థకు అధినేత జగన్.. జైలు లోపలికి అనుమతిస్తే భద్రతా లోపాలు చూపిస్తా: యనమల రామకృష్ణుడు

by Seetharam |
దోపిడీ వ్యవస్థకు అధినేత జగన్.. జైలు లోపలికి అనుమతిస్తే భద్రతా లోపాలు చూపిస్తా: యనమల రామకృష్ణుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే జగన్ క్రిమినల్ ఆలోచన అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, స్కిల్ డెవలెప్మెంట్ లో అవినీతి జరగలేదని సీమన్స్, డిజైన్ టెక్ సంస్థలే చెప్తున్నాయని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో లోకేశ్ బస చేసే కేంద్రం వద్ద యనమల రామకృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అంతక ముందు విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...‘సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని తప్పుడు ఆరోపణలతో మచ్చలేని చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్న భావన ప్రజల్లో ఉంది. రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టినందుకు ప్రజలే స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారు. స్కిల్ డెవెలెప్మెంట్ పథకం మంచి పథకం...మన రాష్ట్రం, దేశంలోనే కాదు..ప్రపంచంలోనే ఒక మంచి సంస్థ సీమన్స్. విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఈ సంస్థను తీసుకొచ్చాం. స్కిల్ డేవెలెప్మెమెంట్ కు యువత వేలకువేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్లే తక్కువ ఖర్చుతో సీమన్స్ సంస్థ ద్వారా పేద యువతకు ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలొస్తాయన్న ఉద్దేశంతో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాం’ అని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

జగన్ ఒక గజదొంగ

తండ్రి అధికారంతో వేలకోట్లు దోచుకున్న జగన్ ఒక గజదొంగ..దాన్ని తాము గతంలోనే నిరూపించాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. ‘గజదొంగకు తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్ సీఎం కాకముందే చూపించారు. రూ.43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అటాచ్ చేసింది అని గుర్తు చేశారు. ఈడీ ఛార్జ్ షీట్, సీబీఐ ఛార్జ్ షీట్లు 26 ఉన్నాయి..16 నెలలు జైల్లో ఉన్నాడు..గజదొంగకు ప్రజలకు మళ్లీ తాళాలు ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్లు ప్రజాధనం స్వాహా చేశాడు. ఈ గజదొంగ గ్యాంగ్ ఇసుక, మైన్స్, లిక్కర్ ద్వారా దోచుకుంటున్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చేవన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. రాష్ట్రానికి ఆదాయం రాకపోవడంతో అప్పులు అయ్యాయి...వైసీపీ మాట ప్రకారం ఆదాయం వస్తే అప్పులు ఎందుకు చేస్తున్నారు.? ఈ ప్రభుత్వమే దోపిడీని అరికట్టకుండా..దోపిడీ చేస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుందన్న భావనకు ప్రజలు వచ్చారు’ అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

నిరుద్యోగ యువత కెపాసిటీ పెంచాలన్న ఉద్దేశంతోనే స్కిల్ డవలప్‌మెంట్ ఏర్పాటు

స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఎవరి గురించి పెట్టారు..దాన్ని కాంట్రవర్సి పెట్టడం వల్ల ఎవరు నష్టపోయారు.? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. యువత భవిష్యత్..సమాజంలో 35 శాతం యువత ఉన్నారు. మన రాష్ట్రంలో 34 శాతం నిరుద్యోగం ఉంది అని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవెలెప్మెంట్‌ను కాంట్రవర్సి చేయకపోతే తనతో చంద్రబాబు జైల్లో ఉండడన్న భావన జగన్‌కు కలిగింది అని అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ లేకపోవడం వల్ల నష్టపోయింది విద్యార్థులు..నిరుద్యోగ యువతే. యువతకు ఉద్యోగాలు రావాలంటే దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి..పూర్వం ఉద్యోగాలు వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు స్కిల్స్ నేర్చుకుంటున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ‘అమెరికాలోనే స్కిల్స్ లేక 7 లక్షల మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. స్కిల్స్ నేర్చుకుంటే వృత్తిలో మరింత రాణిచగలుగుతారు. నిరుద్యోగ యువత కెపాసిటీ పెంచాలన్న ఉద్దేశంతోనే దాన్ని ఏర్పాటు చేశాం. ప్రైవేట్‌లోనే ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయి..అలాంటప్పుడు ఎవరికి స్కిల్స్ ఉంటే వాళ్లే ఉద్యోగాలు పొందుతారు..అందుకే గతంలో గుజరాత్ లో పర్యటించి స్కిల్ డెవలెప్మెంట్‌ను ఏపీలో ప్రవేశపెట్టాం’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

రాష్ట్రం బాగుపడటం జగన్‌కు ఇష్టం లేదు

యువతకు అవకాశాలు లేకుండా చేయడమే జగన్ ఆలోచన అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ‘చదువుకున్న యువత ఆలోచిస్తే జగన్ దొంగతనాలు అన్నీ బయటపడతాయన్న భయంలో జగన్ ఉన్నారు. స్కిల్ డెవెలెప్మెంట్ నాశనం చేస్తేనే జగన్ అనుకున్నది జరుగుతుంది. రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. రాష్ట్రం బాగుపడటం జగన్‌కు ఇష్టం లేదు..అందుకే సీఐడీతో తప్పుడు కేసులు పెడుతున్నారు. అభివృద్ధి చెందిన 5 రాష్ట్రాల్లో జాబితాలో మన రాష్ట్రం ఉండేది..కానీ ఇప్పడు లేదు. కంబోడియాలో ఎన్నికలు జరిగాయి అక్కడ హాన్ సేన్ ఎన్నికల కమిషన్ సాయంతో ప్రతిపక్షాలు లేకుండా గెలిచారు..దాన్ని ఆదర్శంగా జగన్ తీసుకున్నారేమో అనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే డబ్బుతో ఎన్నికలు చేయవచ్చని లక్ష కోట్లు దోచుకున్నాడు. ప్రజా ధనాన్ని లూటీ చేసి, దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు చూస్తున్నాడు. జగన్ పై ఉన్న వ్యతిరేకత ప్రపంచంలో ఎవరిపైనా లేదు. రాజకీయాల్లో ఇంత చెడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. మలేషియన్ ప్రెసిడెంట్ ను గతంలో కరెప్టెడ్ లీడర్ అనుకునేవాళ్లు..కానీ ఇప్పుడు జగన్ ను అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా లబ్ది చేకూరుతోంది..కానీ ఇప్పుడు వారికే అన్యాయం జరిగింది’ అని యనమల ఆరోపించారు.

బొత్స కూడా కబుర్లు చెప్తున్నారు

‘రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే ఎవరైనా పరిశ్రమలు పెడతారా.? వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయింది..బొత్స కూడా కబుర్లు చెప్తున్నారు..రూ.11కోట్లకు కక్కుర్తి పడటంతోనే ఆ కంపెనీ పుణెకు వెళ్లిపోయింది’ అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ‘పరిశ్రమలు రాకపోయినా నష్టపోయేది యువతే. జగన్ యూత్ ను నాశనం చేశాడు. పేదకులాల వారిని దెబ్బదీశాడు..పథకాలు పెడతున్నానంటూ సోది చెప్తున్నాడు. రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహం అంతాఇంతాకాదు. కుటుంబానికే జగన్ ద్రోహం చేశాడు..ఇక రాష్ట్రానికి ద్రోహం చేయడం ఎంతసేపు.? వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది. చంద్రబాబును బద్నాం చేసేందుకు జగన్ ఏం చెప్తే సీఐడీ అది చేసింది. రూల్ ఆఫ్ లా లేకుండా సొంత చట్టాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ఎవరూ సంతోషంగా లేరు..మీడియాను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తేనే సమాజం నిలబడుతుంది. జగన్ పత్తిత్తు అయితే దోచుకున్న డబ్బులు రాష్ట్ర అప్పులకు కట్టాలి. రాష్ట్రంలో 40కి పైగా స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు పెట్టామని సీమన్స్ సంస్థవాళ్లే చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా 26 సార్లు చంద్రబాబుపై విచారణ చేయించారు..ఏమీ చేయలేదు. జగన్ తండ్రి చనిపోయారన్న సింపతితోనే గతంలో ఓట్లు వేశారు. జైలు లోపలికి నన్ను పంపిస్తే భద్రతలో లోపాలు చూపిస్తా. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి చంద్రబాబుకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు.? అవినీతి జరగలేదని సీమన్స్, డిజైన్ టెక్ స్పష్టంగా చెప్తోంది..కానీ జగన్ సీఐడీ, వాళ్ల మనుషులు ఒక ప్లాన్ వేసుకుని ఇరికించాలనేదే వారి ప్రయత్నం. ఎటువంటి అక్రమ కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటాం’అని యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు.

Next Story