జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. లండన్ నుంచి రాగానే అలాంటి గతి పట్టనుందంటూ...

by Hamsa |
జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. లండన్ నుంచి రాగానే అలాంటి గతి పట్టనుందంటూ...
X

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఫలితాలు జూన్ 4 రాబోతుండటంతో.. కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి భారీ మెజారిటీతో పవన్ గెలుస్తాడని ఫ్యాన్స్ వాధిస్తుంటే.. మరికొందరు మాత్రం జగన్ విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారు.

ఆయనకు జైలే గతి పట్టనుంది’’ అంటూ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన వారు కొందరు నువ్వు చెప్పినట్లు కూటమికి 145 సీట్లు రాకపోతే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అలాగే ఏదైనా తేడా కొడితే ఏపీలో నీ చేపల పులుసు షాప్స్ ఒక్కటి కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed