అవకాశమిస్తే ప్రజాసేవకే అంకితమవుతా...

by Dishanational1 |
అవకాశమిస్తే ప్రజాసేవకే అంకితమవుతా...
X

దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మన రాష్ట్రం బీహార్ గా మారుతుంది. ధరలు మరింత ఆకాశాన్ని అంటుతాయి. కరవు పెరిగిపోతుంది. పరిశ్రమలు రావు. ఉపాధి ఉండదు అంటూ టీడీపీ సీనియర్ నేత దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకరమణ చౌదరి తన దైన శైలిలో జనంలో అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వల్ల రాబోవు రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా నష్ట పోతుందో కూడా వివరిస్తున్నారు. పార్టీలో తన రోల్ ఏంటనే దాని కన్నా తాను పార్టీ కోసం ఏం చేస్తున్నాననేదే ముఖ్యమని అంటున్నారు. తన తండ్రి చేసిన మంచి పనులతోపాటు తన కృషి తోడవుతుందని చెబుతున్నారు. గురువారం ఆయన దిశ పత్రికతో తన అంతరగాన్ని పంచుకొన్నారు. వాటి వివరాలు చూద్దాం..

తండ్రి మంచి పనులే విజయానికి బాటలు

భాస్కర రామారావు టీడీపీ అవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. తొలినాళ్లలో సొంత గ్రామం పెద్దాడ సర్పంచిగా ఉత్తమ సేవలందించారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా, ప్రణాళికా సంఘం అధ్యక్షునిగా, పెద్దాపురం శాసన సభ్యునిగా సేవలందించారు. చంద్రబాబుతో మంచి అనుబంధం ఉండేది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. కరోనా సమయంలో తుది శ్వాస విడిచారు.

2024లో చంద్రబాబే ఎందుకంటే..

జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వలన రానున్న రోజుల్లో రాష్ట్రం బాగా వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. వృద్ధి రేటు బాగా పడిపోతుంది. దీంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రారు. ధరలు బాగా పెరిగిపోతాయి. ఉపాధి లేక యువత ఇబ్బంది పడతారు. ఇది రాష్రానికి చాలా అశుభ పరిణామం. చంద్రబాబు రాజకీయ పరిణితి రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. టీడీపీ అధినేత సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు. ఉదాహరణకు కియా మోటారు రాష్ట్రంలో ఏర్పాటుకు చంద్రబాబు చేసిన కృషే కారణం. అంతేగాక ఏదైనా పరిశ్రమ తెలంగాణా వస్తుందంటే చంద్రబాబు అక్కడి వాలిపోయేవారు. ఆ పరిశ్రమ ఆంధ్రకు వచ్చేలా ప్రయత్నించేవారు. అందుకే 2024లో చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి బాగుంటుందని వెంకటరమణ చౌదరి అన్నారు.

2013లో ఏక గ్రీవ సర్పంచిగా..

2013లో నేను మా గ్రామానికి ( పెద్దాడ)కు ఏక గ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యాను. నాడు గ్రామంలో విద్య , పారిశుధ్యం, అభివృద్ధి వంటి వాటి మీద దృష్టి పెట్టాను. ప్రతిరోజూ బహిరంగ మల విసర్జన నిషేధం గురించి మైక్ లో ప్రచారం చేయించేవాడిని. అన్ని పాఠశాలలు అభివృద్ధి చేశాను. విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్లు కొనిచ్చాను. గతంలో మా నాన్నగారు సర్పంచిగా చేసిన సమయంలో అనేక రహదారులు వేశారు. మిగిలిన రహదారులు నేను పూర్తి చేశాను.

అవకాశమిస్తే పెద్దాపురం నుంచి పోటీ చేస్తా

పార్టీ ఆదేశిస్తే, నేను పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ విషయం ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుతో చెప్పుకొన్నాను. పార్టీలో అనేక మంది సానుకూలంగా ఉన్నారు. 2012లో రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో ఖర్చంతా నాన్న గారే భరించారు. అయితే నన్ను కాకినాడ పార్లమెంటుకు పోటీ చేయాలని, సీటు ఖాయం చేయిస్తామని పార్టీలో ఒక పెద్దాయన కోరాడు. కానీ ఆయన ఏం ఉద్దేశంతో కోరారో తెలియదు కానీ సీటు ఇచ్చేది మా అధినేత చంద్రబాబు మాత్రమే. నేను మాత్రం పార్టీ అవకాశం ఇస్తే పెద్దాపురం నుంచే పోటీ చేస్తాను. కచ్చితంగా గెలుస్తాను.



Next Story

Most Viewed