ఏపీ రాజకీయాల్లో పెనుసంచలనం.. ముద్రగడ ముఖ్య అనుచరుల రివర్స్

by Disha Web Desk 16 |
ఏపీ రాజకీయాల్లో పెనుసంచలనం.. ముద్రగడ ముఖ్య అనుచరుల రివర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతోంది. అయితే కూటమిలో భాగంగా ఈసారి జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉండటంతో కాపులు ఓట్లు ఎటు పడతాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనకు సపోర్టు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కాపు రాజకీయాల్లో పెను మార్పుల చోటు చేసుకోబోతోన్నాయి. కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభానికి బిగ్ షాక్ తగిలింది. ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు, బలిజ, ఒంటరి కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ సంఘాల నేతలు అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభానికే కాకుండా అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా భారీ నష్టం కలిగే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన కేబినెట్‌లో మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే కులాన్ని కించపర్చేలా సొంత నేతలే మాట్లాడటం కాపులు రుచించుకోలేకపోయారు. కాపు జాతి నుంచి పవన్ లాంటి స్టార్ ఉంటే కులాన్ని కించపర్చడం సరికాదని చాలా మంది కాపు నేతలు లోలోపల మథన పడ్డారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది. అటు సర్వేల్లో కూటమికే అధికారం ఖాయంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు, బలిజ, ఒంటరి కుల సంఘాల నేతలు ఝలక్ ఇచ్చారు.

Next Story

Most Viewed