నన్ను క్షమించండి.. ఆయన నన్ను నమ్మలేదు

by Disha Web Desk 5 |
నన్ను క్షమించండి.. ఆయన నన్ను నమ్మలేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను ఓదారుస్తూ క్షమాపణలు చెప్పారు. ఇన్నాళ్లు మీ అందరి కృషే పార్టీని ఇంతవరకు తీసుకొచ్చిందని అన్నారు. ఎవరూ బాధపడవద్దని మీ కష్టపడటం వల్లే నేను నిలబడ్డానని, తనని నమ్మినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నన్ను నమ్మారని, తాను పవన్ కళ్యాణ్ ని నమ్మానని, కానీ ఆయన మనల్ని నమ్మలేదని వాపోయారు.

మీ సపోర్టు వల్లే పైకి వచ్చానని, మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించాలని అన్నారు. కాగా కొత్తపేట నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న బండారు శ్రీనివాస్ కొత్తపేట టికెట్ ఆశించి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత కొన్ని నెలలుగా కొత్తపేటలో కలియతిరుగుతూ.. పార్టీకి బలం పెంచారు. పొత్తులో భాగంగా కొత్తపేట సీటు టీడీపీ నుంచి బండారు సత్యనందరావుకు వెళ్లడం పట్ల తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇన్నాళ్లు తన వెంట నడిచిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు క్షమాపణలు చెబుతూ బాధపడ్డారు.


Next Story

Most Viewed