విశాఖ స్టీల్ ప్లాంట్ మృతులు.. ఐడెంటిఫై చేసేందుకు నాలుగు రోజులు?

by Naga Rani Yarlagadda |

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన 8 మంది కార్మికులను బలితీసుకుంది. మృతదేహాలను గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతులు.. ఐడెంటిఫై చేసేందుకు నాలుగు రోజులు?
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన 8 మంది కార్మికులను బలితీసుకుంది. 1500 డిగ్రీలతో మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడటంతో వారంతా సజీవ సమాధి అయ్యారు. కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. నిన్న రాత్రి నుంచి కేజీహెచ్ లోనే మృతదేహాలను భద్రపరచగా.. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలను మాత్రమే వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. భానుకుమార్, రమణ మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించగా.. మిగతా మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు పోలీసుల సమక్షంలో తమవారిని గుర్తుపడితే డీఎన్ఏ టెస్టులు చేస్తామని, ఆ రిపోర్టులు వచ్చేందుకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని తెలిపారు. డీఎన్ఏ టెస్టుల్లో ఎక్కువగా ఛాతీలో ఉండే ప్లేట్ లాంటి బోన్ ను ఉపయోగిస్తామని, లేదంటే తొడ భాగంలో తీసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందినవారి డెడ్ బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో.. వారి మజిల్ ద్వారా డీఎన్ఏ టెస్ట్ చేస్తామన్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి బంధువులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పరామర్శ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. సెవెన్ హిల్స్, కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్ లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.

Next Story