వైఎస్ షర్మిలపై పవన్ కల్యాణ్ విమర్శలు.. తెలంగాణలో ఓటింగ్ శాతంపై కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 21 |
వైఎస్ షర్మిలపై పవన్ కల్యాణ్ విమర్శలు.. తెలంగాణలో ఓటింగ్ శాతంపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. యువత జనసేనతో కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న యువతను చూసి తనతోపాటు బీజేపీ అధిస్టానం సైతం ఆశ్చర్చపోయిందని అన్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కుమార్తె, సీఎం సోదరిగా ఉన్న వారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలపలేకపోయారు అని ప్రశ్నించారు. తెలంగాణలో తాను పెద్దగా పర్యటనలు చేయలేదు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తన భావజాలం నచ్చి తనతో కలిసి యువత అడుగులు వేసిందని చెప్పుకొచ్చారు. ఎనిమిది స్థానాల్లో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోటీ చేశారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన ఐడియాలజీ నచ్చే వారు ముందుకు వచ్చారు. జనసేన అనేది వ్యక్తుల పార్టీ కాదు. భావజాలంతో నడిచే పార్టీ. ఇది‌ భవిష్యత్తులో తప్పకుండా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం అన్న బీజేపీ జనసేనను మిత్ర పక్షంగా కలుపుకుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఓటింగ్ శాతం చూసి బాధ కలిగింది అని పవన్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్‌ బాధాకరమని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Next Story