మీ తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: చిరంజీవికి పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్

by Disha Web Desk 21 |
మీ తమ్ముడిగా పుట్టడం  నా అదృష్టం: చిరంజీవికి పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మెగాస్టార్‌ చిరంజీవికి సోదరుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.‘మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లు... మీ పయనం నాకు గోచరిస్తుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకునప్పటికీ కించిత్‌ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీకి జన్మదిన సందేశాన్ని తెలియజేశారు. మీరు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story

Most Viewed