ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి రాజధానిగా కోనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేసేవారు.. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో రాజ్యసభలోను చర్చిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది.

ఇదిలా ఉంటే.. ప్రత్యేకహోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో తెలంగాణలో మరోసారి ఏపీ నేతల కన్ను పడిందనే చర్చ మొదలైంది.

Read Disha E-paper

Next Story

Most Viewed