భర్త డ్యూటీకి.. ఇంట్లో ప్రియుడితో భార్య రాసలీలలు : భర్తకు తెలియడంతో భార్య ఘాతుకం

by Seetharam |
భర్త డ్యూటీకి.. ఇంట్లో ప్రియుడితో భార్య రాసలీలలు : భర్తకు తెలియడంతో భార్య ఘాతుకం
X

దిశ, డైనమిక్ బ్యూరో : భర్తేమో ఉపాధ్యాయుడు. చక్కటి కుటుంబం. ఇంట్లో పెత్తనం అంతా ఆమెదే. ఇంట్లో తనకేం ఎదురులేదని భావించింది. ఏం చేసినా అడిగేవారు లేరనుకుంది. ఇంతలో పరాయి పురుషుడు మోజులో పడింది. అంతే భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో సరసాలు ఆడటం మెుదలు పెట్టింది. ఇలా భర్త కళ్లుగప్పి ఆరేళ్లు వివాహేతర సంబంధం కొనసాగించింది. చివరకు భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడికి దూరంగా ఉండాలని షరతులు విధించాడు. దీంతో ఆమె ప్రియుడి ఎడబాటును భరించలేకపోయింది. భర్తను అడ్డుతొలగించుకుంటేనే ప్రియుడితో కలిసి ఉండగలమని భావించింది. అంతే ప్రియుడితో కలిసి భర్తను అంతమెుందించింది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. మహానంది మండలంలో ఉపాధ్యాయుడు సింధే నర్సోజీ హత్యకేసును విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసే సరికి షాక్‌కు గురయ్యారు.

ప్రియుడిపై మోజు

నంద్యాల ఎస్పీ కె.రఘువీరారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన సింధే నర్సోజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నర్సోజీకి జయశ్రీ అనే మహిళతో వివాహమయింది. పెళ్లైన కొంతకాలానికి నర్సోజీ భార్య జయశ్రీ అదే గ్రామానికి చెందిన రవీంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భర్త ఉపాధ్యాయుడి కావడంతో స్కూల్‌కి వెళ్లడం ఈమె ప్రియుడితో సరసాల్లో మునిగితేలుపోతుండేది. ఈ విషయం భర్తకు తెలిసింది. పద్దతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ తీరుమార్చుకోలేదు. పంచాయతీకి పెట్టాడు. అయినా తీరుమారలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న నర్సోజీ, రవీంద్ర మధ్య గొడవ జరిగింది. తన భార్య జోలికి రావొద్దని నర్సోజీ హెచ్చరించాడు. ఈ విషయాన్ని రవీంద్ర ప్రియురాలు జయశ్రీకి తెలిపాడు. తన భర్తను అడ్డుతొలగించుకుంటేనే తమ బంధం మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందని జయశ్రీ రవీంద్రకు తెలిపింది. తన భర్తను హత్య చేయాలని సూచించింది. నర్సోజీని హత్య చేసిన తర్వాత ఈ కేసు బయటకు రాకుండా తాను మేనేజ్ చేస్తానని భరోసా ఇచ్చింది.

భార్య స్కెచ్ ఇదే

ప్రియురాలి మాటలు నమ్మిన రవీంద్ర సెప్టెంబర్ 4న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నర్సోజీ తన మోటార్‌సైకిల్‌పై పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతన్ని రవీంద్ర, అతని ఐదుగురు స్నేహితులు కలిసి దారిలో అడ్డగించారు. ఆ తరువాత అంతా కలిసి గొడ్డలితో నరికి చంపారు. ఈ హత్యపై నర్సోజీ తల్లి సింధే రాంబాయి నంద్యాల తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని చాబోలు రోడ్డులోని గ్రామంలోని ఇటుక బట్టీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి నర్సోజీ సతీమణి జయశ్రీయేనని పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో జయశ్రీతో పాటు సిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన రవీంద్ర, గుండపోగుల రాజేష్, మహానంది మండలం బస్సాపురం గ్రామానికి చెందిన కాలె వెంకట రమణ, నక్క చిన్న నరసింహులు, నల్లబోతుల వెంకటేశ్వర్లు, నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన జజ్జం నాగేంద్రలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కే రఘువీరా రెడ్డి వెల్లడించారు.

Next Story