- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Ap News: చంద్రబాబు పాలనకు 100 రోజులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం (NDA Government) అధికారం చేపట్టి ఈ నెల 20కు వంద రోజులు పూర్తి చేసుకోనుంది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (Telugu Desam), జనసేన (Janaseana), బీజేపీ (Bjp) కూటమిగా పోటీ చేసి 164 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టాయి. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించింది. పాలన ప్రారంభించినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను అధిగమించింది. మొత్తంగా ఈ నెల 20కు 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది.
దీంతో కూటమి పాలనపై ప్రోగెస్ రిపోర్టు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు 100 రోజుల పాలనపై (100 Days Governance), మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 20వ తారీకు నుంచి 26 తేదీ వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. ప్రజల వద్దకే వెళ్లి తమ పాలనపై అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగనున్న ఈ సమావేశానికి అందరూ రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలు, లోటు పాట్లపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
Read More..