Railway Budgetలో ఏపీకి భారీగా నిధులు

by Disha Web Desk 16 |
Railway Budgetలో ఏపీకి భారీగా నిధులు
X
  • రూ.8,406 కోట్లు కేటాయించినట్లు కేంద్రం వెల్లడి
  • విశాఖపట్నం, నెల్లూరు,తిరుపతి రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు నిధులు

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. రైల్వే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8,406 కోట్ల నిధులను కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఇది తెలంగాణకు కేటాయించిన నిధులు కంటే రెట్టింపు అని పేర్కొన్నారు.

విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపులు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ. 299.21కోట్లు, నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునీకరణకోసం రూ.102.04కోట్లు, విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రూ. 388.91కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు అకొల- డోన్ మార్గంలో డబ్లింగ్ పనుల కోసం రూ. 60 కోట్లు, ఖాజీపేట - విజయవాడ థర్డ్ లైన్ పనులకు రూ. 337 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మరోవైపు బైపాస్ లైన్ల కోసం రూ.383.12 కోట్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ. 125 కోట్ల నిధులు కేటాయించినట్టు కేంద్రరైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.


Next Story