- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రసాదరెడ్డి ముఠా అక్రమాలు ఎన్నెన్నో..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి పేరిట ఆయన ముఠా చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం, ప్రసాదరెడ్డిని మార్చడంతో వైసీపీ పాలనా కాలంలో ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి, అన్యాయాలు బయటపడుతున్నాయి. వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ ముఠా అంటే హడల్ ..
పాలనా వ్యవహారాలు సంబంధించి అత్యంత కీలకమైన ఎస్ 3 సెక్షన్ సూపరింటిండెంట్‌గా ప్రసాదరెడ్డి హయాంలో పనిచేసిన కె. శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగ సంఘం నేత రవికుమార్, వీసీ పీఏ అయిన టైం స్కేల్ ఉద్యోగి శ్రీనివాసరెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి బోధనేతర ఉద్యోగులను భయకంపితులను చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి దానికి వీసీ ప్రసాదరెడ్డి పేరు చెప్పి భయపెట్టి లక్షల్లోనే వసూళ్లకు చేశారంటూ వీరిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏయూలో వీరిని కాదంటే ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయంటే పాలన ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
డిసీజ్డ్ కోటా ఉద్యోగాలంటే వీరికి పండగే..
ఏయూ లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు డిసీజ్డ్ కోటాలో నిబంధనల మేరకు ఉద్యోగావకాశం కల్పిస్తారు. అయితే ఈ ముఠా దీనినే వసూళ్లకు మార్గంగా మలచుకొంది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యలు ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు లేని పోని నిబంధనలు చెప్పి వారిని భయపెట్టి తాము అడిగిన డబ్బు ఇచ్చిన తర్వాత అవకాశం కల్పించేవారు. నిబంధనల మేరకు వీరికి క్లాస్ 4 ఉద్యోగాలే ఇస్తారు. అర్హత బాగా వుంటే స్కిల్డ్ ఉధ్యోగాలు వస్తాయి. యూనినేత రవికుమార్ వీరికి ఫోన్ చేసి బాగా చదువుకొన్న మీరు ఏ యూ ఇచ్చే ఉద్యోగాలు చేయలేరని, తనను సంప్రదిస్తే ఎస్ 3 శ్రీనివాసరెడ్డి, వీపీ పీఏ శ్రీనివాసరెడ్డిల ద్వారా స్కిల్డ్ పోస్ట్ చేయిస్తానని సొమ్ములు వసూలు చేసేశారని తెలిసింది. చనిపోయిన వ్యక్తికి వివాహం అయిన కుమార్తె వుంటే ఆమెకు ఉద్యోగం రాదని , తాము ఇప్పిస్తామని చెప్పి పీతల శ్రీను అనే ఉద్యోగి తరపున ఆమె కుమార్తె అయిన తాతారావు భార్యకు వచ్చేందుకు వసూళ్లు చేశారని తెలిసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఆధార్ కార్డులో తేదీ మార్చడమే ఎస్3 శ్రీను పని..
ఏయూలో టైం స్కేల్ ఉద్యోగులు చాలా మంది పదవీ విరమణకు దగ్గరయ్యారు. వారు సర్వీసులో చేరినప్పుడు డేట్ ఆఫ్ భర్త్ సర్టిఫికేట్‌లు సరైనవి సమర్పించలేదు. ఇదే ఎస్ 3 సెక్షన్ శ్రీనివాసరెడ్డికి వరంగా మారింది. తనకు లక్షల్లో ముడుపులు సమర్పించుకొన్న వారి పుట్టిన తేదీలను ఆధార్ కార్డుల్లో మార్చి వాటినే పరిగణనలోకి తీసుకుని సర్వీస్ పెరిగేట్లు చూసేవారు. అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు అందుకునేవారు. ముడుపులు ఇవ్వడానికి ముందుకు రాని ఉద్యోగులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించి తమకు అన్యాయం జరిగిందని వేడుకొన్నా పట్టించుకునేవారు కాదనే ఆరోపణలున్నాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ సాంబమూర్తి వద్ద అటెండర్‌గా పనిచేసిన వ్యక్తి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొన్నా ఆయనకు లంచం ఇవ్వని కారణంగా స్కేల్ , పెన్షన్ ఇవ్వలేదు. వీటన్నింటిపై ఇప్పుడు విచారణ జరుగుతుంది.