టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో మొత్తం గ్రాడ్యువేట్లు ఎంత మంది అంటే..?

by Rajesh |
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో మొత్తం గ్రాడ్యువేట్లు ఎంత మంది అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ -జనసేన కూటమి తొలి జాబితాను ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రకటించిన 99 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 60 మంది గ్యాడ్యువేట్లు ఉన్నారన్నారు. 30 మంది పోస్ట్ గ్రాడ్యువేట్లు, ఇద్దరు పీహెచ్ డీ, ఒక ఐఏఎస్, ముగ్గురు ఎంబీబీఎస్ చదివిన వారికి టికెట్ ఇచ్చామన్నారు. వయసు ప్రాతిపాదికన కేటాయించిన సీట్లను సైతం మీడియాకు వెల్లడించారు. 25-35 మధ్య వయసు ఉన్నవారికి రెండు సీట్లు కేటాయించామన్నారు. 36-45 మధ్య వయసు ఉన్నవారికి 22, 46-60 వయసు ఉన్న వారికి 55, 61-75 వయసున్న వారికి 20 టికెట్లు కేటాయించారు. మొత్తం అభ్యర్తుల్లో 86 మంది పురుషులు, 13 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 118 స్థానాలకు గాను టీడీపీ 94, జనసేన 24 సీట్లు సర్ధుబాటు చేసుకున్నాయి.

Read More..

BREAKING: రాజమండ్రి రూరల్ సీటుపై చంద్రబాబు కీలక ప్రకటన



Next Story

Most Viewed