అరె ఫూల్‌.. ఎవర్రా సైకో.. కామెడీస్టార్‌ : నారా లోకేశ్‌ మాజీమంత్రి కురసాల కన్నబాబు వార్నింగ్

by Seetharam |
Kursala Kannababu
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళంపై మాజీమంత్రి కురసాల కన్నబాబు సెటైర్లు వేశారు. నారా లోకేశ్ కాదని పులకేశ్‌ అని విమర్శించారు. తింగరోడు తిరునాళ్లకు వెళ్లిన చందంగా అతనే జనాల్ని తెచ్చుకుని.. అతనే జెండాలు పట్టిచ్చి తనకు తానే శాపనార్ధాలు పెట్టుకుంటూ యాత్ర పూర్తయిందంటూ వచ్చిపోయాడు అని విమర్శించారు.కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పాదయాత్ర చేయగానే పెద్ద నాయకుడిగా గుర్తింపు వస్తుందనే పిచ్చిభ్రమల్లో నారా లోకేశ్ ఉన్నాడని ఆరోపించారు. రాయలసీమ నుంచి యాత్ర అని మొదలుపెట్టి అక్కడక్కడా పడుతూలేస్తూ గోదావరి జిల్లాలకు చేరుకోగానే.. వాళ్ల నాన్న చంద్రబాబు అవినీతి కేసులో జైల్లోకి పోయాడు అని గుర్తు చేశారు. నాన్నను లోపలేయగానే పులకేశ్‌ 89 రోజులు పాటు యాత్ర ఆపేశాడు. మళ్లీ ఇప్పుడు బయటకొచ్చి కామెడీస్టార్‌లా వచ్చీరాని తెలుగు పదాలతో మాట్లాడుతూ.. అందర్నీ నవ్వుకునేలా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రానా ఏ వ్యక్తీ మానవత్వం, సంస్కారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది, నారా పులకేశ్‌ మాత్రం తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని సంస్కారహీనుడిలా తయారయ్యాడు అని ధ్వజమెత్తారు. నాయకుడంటే పదిమందికి ఆదర్శంగా ఉండి.. అండగా నిలిచి వారిని ముందుకునడిపించే వాడై ఉండాలి. కానీ, ఈ పులకేశ్‌కు అలాంటి నాయకత్వ లక్షణాలేమీ లేవు. ఎంతసేపూ.. తినడం, పడుకోవడం, గుర్తుకొచ్చినప్పుడు లేచి కొంతదూరం నడవడం, ఎవడో ఇచ్చిన స్క్రిప్టును చదవడమే పని అని మాజీమంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.


నీ బిల్డప్పులకు పప్పులుడకవ్‌

నారా పులకేశ్‌ తనకు తాను పెద్ద మహానాయకుడిగా ఊహించుకుని తమపై అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో హెరిటేజ్‌ మజ్జిగదగ్గర మొదలుకుని, అనకాపల్లి బెల్లం నుంచి, అమరావతి భూముల దాకా అడ్డగోలుగా దోచుకు తిన్న వ్యక్తి లోకేశ్ అని ఆరోపించారు. పోలవరంను ఏటీఎంగా మార్చేశాడని సర్టిఫికేట్‌ తెచ్చుకున్న వ్యక్తి తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా లోకేశ్‌ వ్యవహారశైలి ఉందని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబు కొడుకుగా నువ్వొక బచ్చాగాడివి పులకేశ్‌ అని విమర్శలు చేశారు. అసలు నీకు సంస్కారం, జ్ఞానం ఉందా..? అని నిలదీశారు. ఒంటిచేత్తో 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను గెలిపించుకున్న వ్యక్తిని, సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికెంతొస్తే అంత మాట్లాడుతావా..? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటావా..? అరె ఫూల్‌.. ఎవర్రా సైకో.. ఈ రాష్ట్రంలో సైకో సర్టిఫికెట్‌ పొందిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది నీ మామే కదా..? సొంత నీకు పిల్లనిచ్చిన మామే పెద్ద సైకో అని సర్టిఫికెట్‌ పొంది నీదగ్గర ఉంటే.. నువ్వేమో ఎదుటోళ్లని మాట్లాడుతావా..? అని మాజీమంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.Next Story

Most Viewed