- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
బ్రేకింగ్: ఏపీలో భారీ వర్షం.. తిరుపతిలో కుప్పకూలిన 20 ఇళ్లు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రం వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది.
తిరుపతి జిల్లాలోని కొరమీను గుంటలో బలమైన ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షం దాటికి 20కి పైగా రేకుల ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా రాజమండ్రిలో సైతం భారీ వర్షం పడుతోంది. రాజమండ్రిలో టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు సభ ప్రాంగణం వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో మహానాడు సభకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గాలుల దాటికి సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలు, కటౌట్‌లు కూలిపోయాయి. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలిరావడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, చిత్తూరు, బైరెడ్డిపల్లితో పాటు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.