ఏసీబీ కోర్టులో పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

by Seetharam |   ( Updated:2023-09-19 12:21:54.0  )
ఏసీబీ కోర్టులో పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈనెల 20కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో మంగళవారం మూడు పిటిషన్లు విచారణకు వచ్చాయి. అందులో ఒకటి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్, రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్‍పై చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్యాష్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న విషయాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీసుకెళ్లారు. హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు కస్టడీ పిటిషన్‍పై ఎటువంటి ప్రక్రియ చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం సీఐడీ కస్టడీ, చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‍పై విచారణ రేపటికి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed