‘గాంధీజీ మార్గంలో మంచిని ప్రోత్సహిద్దాం’.. బాపూజీకి నివాళులర్పించిన కేంద్రమంత్రి

by Jakkula Mamatha |
‘గాంధీజీ మార్గంలో మంచిని ప్రోత్సహిద్దాం’.. బాపూజీకి నివాళులర్పించిన కేంద్రమంత్రి
X

దిశ ప్రతినిధి, గుంటూరు:‘ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో మంచి చేయాలి, మంచిని గుర్తించాలి, మంచిని ప్రోత్సహించాలి. వీటితోపాటు బాపు కలలుగన్న పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని సాకారం చేసుకోవాలి’ అని రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి తో కలిసి బుధవారం గుంటూరులో హిమాని సెంటర్ లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే సిద్ధాంతాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన అహింసా సిద్ధాంతాన్ని ఆచరించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛత కోసం బాపూజీ పాటుపడ్డారని, ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలని చెప్పారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఓబులేషు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed