- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Vinukonda: డాక్యుమెంట్ రైటర్లకు టీడీపీ లీడర్ భరోసా

దిశ, వినుకొండ: అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పాలన గాడి తప్పిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. జీ.వి ఆంజనేయులను రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైమ్ 2.0 సాఫ్ట్‌వేర్‌ను బలవంతంగా అమలు చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. 2.0 సాఫ్ట్‌వేర్‌పై ప్రజలతో చర్చించలేదని మండిపడ్డారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా రిజిస్ట్రేషన్లు అమలు జరిపితే ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఫిజికల్ డాక్యుమెంట్ల స్థానంలో ఆన్‌లైన్ డాక్యుమెంట్ల పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడంపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.