Ap News: వైసీపీపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

by Disha Web Desk 16 |
Ap News:  వైసీపీపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్చి 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఒకవైపు ఓట్లను తారుమారు చేయడంతోపాటు మరోవైపు అప్పుడే ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.


టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ఎమ్మెల్సీ కల్పనా రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని కడప ఆర్జేడీగా నియమించారని చెప్పారు. గతంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన భార్య కల్పనా రెడ్డిని ప్రలోభాలు, బెదిరింపులతో గెలిపించుకున్న చరిత్ర ప్రతాప్ రెడ్డిదని, అలాంటి వ్యక్తిని అడ్డంపెట్టుకుని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.


Next Story

Most Viewed