- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLC Election Polling: చాపర్‌లో వచ్చి ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. వెలగపూడిలోని అసెంబ్లీ మీటింగ్ హాలులో ఈ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నాం ఒంటిగంటలోపు 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ఓటుపై ఉత్కంఠ కొనసాగింది. తన కుమారుడి వివాహం నేపథ్యంలో ఆయన ఓటు వేయలేకపోవడంతో వైసీపీ నాయకత్వం ఆయన కోసం ప్రత్యేక చాపర్‌ను పంపింది.
దీంతో ప్రత్యేక చాపర్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా వెలగపూడిలోని అసెంబ్లీ మీటింగ్ హాలుకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సిబ్బంది కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఫలితం వెల్లడికానుంది.