- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking: ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. రిజల్ట్స్‌పై ఉత్కంఠ
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వెలగపూడిలోని అసెంబ్లీ మీటింగ్ హాలులో ఈ పోలింగ్ జరిగింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక ఏడు స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏడు స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుగురు సభ్యులను బరిలోకి దించింది. అయితే ఒక స్థానానికి టీడీపీ సైతం బరిలోకి దించింది. పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడంతో ఎన్నిక జరిగింది. వైసీపీ అధినేత సీఎం జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఓటు వేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వైసీపీకి ఇద్దరు రెబెల్ ఎమ్మె్ల్యేలు ఆనం, కోటంరెడ్డి ఎవరికి ఓటేశారనేదానిపై ఆసక్తిగా మారింది. మరోవైపు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో ఏడు స్థానాల్లోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే మరికాసేపట్లో ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభంకానుంది. కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే ఫలితాన్ని కూడా ప్రకటిస్తారు. ఇప్పటికే 7 స్థానాల్లో గెలుస్తామని వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ గెలుస్తోందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.