Guntur: రోజానా మజాకా.. దద్దరిల్లిపోవాల్సిందే..!

by Disha Web Desk 16 |
Guntur: రోజానా మజాకా..  దద్దరిల్లిపోవాల్సిందే..!
X

దిశ వెబ్ డెస్క్: మంత్రి రోజా (Minister RoJa) గతంలో నటి. చాలా సినిమాల్లో నటించారు. ఆమె నటనకు బహుమతులు కూడా వచ్చాయి. ఇక ఆమె డ్యాన్స్‌కు అప్పట్లో కుర్రకరంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ రోజా కనిపిస్తే చాలు మైమర్చిపోతారు. అయితే రాజకీయ జీవితంలోకి వెళ్లిన తర్వాత కూడా రోజా కొన్ని సినిమాలు, టీవీ షోలు చేశారు. ప్రస్తుతం ఆ షోలు చేయడంలేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం సందడి చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను, చూపరులను ఆకట్టుకుంటున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో జగనన్న స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. అయితే రోజా తాను మంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. వెంటనే ఆమె అక్కడి వెళ్లిపోయారు. వారితో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో స్టేజ్ మొత్తం దద్దరిల్లింది. రోజా డ్యాన్స్‌తో అక్కడి ఉన్న వారంతా ఉత్సాహంగా అరుపులు, కేకలు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి అయినప్పటి నుంచి రోజా ఆనందానికి హద్దుల్లేవని.. ఎక్కడ స్టేజ్ కనిపించినా సందడి చేసేస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు.

Read more:

1.Konaseema: ఇరిగేషన్‌లో కామంధుడు.. యువతుల నగ్న వీడియోలు తీసి.



Next Story