డిప్యూటీ సీఎం పవన్ చొరవ.. కోటప్పకొండ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

by Jakkula Mamatha |
డిప్యూటీ సీఎం పవన్ చొరవ.. కోటప్పకొండ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ రహదారి నిర్మాణ పనులు రూ.3.9 కోట్లతో చేపట్టారు. మహా శివరాత్రి వేడుకలకు కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులు సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కిందటి నెలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్యే ప్రతిపాదనపై తక్షణమే స్పందించి రూ. 3.9 కోట్ల నిధులతో ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

పనులు వేగంగా చేయాలని స్పష్టం చేశారు. దీని శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిశారు. కోటప్పకొండ రోడ్డు పనులకు నిధులు కేటాయించి మహా శివుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియచేశారు. వచ్చే నెలలో జరగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని అందించారు.

Advertisement

Next Story

Most Viewed