వేంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం

by Dishanational2 |
వేంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : గుంటూరులోని వతుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ ఆద్వర్యలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ణ, మహాసంప్రోక్షణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మొదటి దర్శనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ.40 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం జరిగింది. జూ 4 నుంచి కొనసాగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేటి సాయంత్రం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమల తర్వాత టీటీడీ వెంకటపాలెంలోనే అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు


Next Story