యరపతినేని, జంగాకు గుడ్ న్యూస్.. ఆ స్థానాలు వారివే..!

by Disha Web Desk 16 |
యరపతినేని, జంగాకు గుడ్ న్యూస్.. ఆ స్థానాలు వారివే..!
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన తొలి జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని, జంగా కృష్ణమూర్తులకు టికెట్లు దక్కలేదు. దీంతో వారిద్దరూ అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సీటు కేటాయింపులపై చర్చలు జరిపారు. అయితే వీరిద్దరికి కూడా సీటు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట అభ్యర్థిగా యరపతినేని, గురజాల అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి పేర్లను పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి అభ్యర్థిత్వంపై ఆయా నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి ఎంపికపై ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. ఇక యరపతినేనికి నరసరావుపేట టికెట్ ఖరారు అయినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. జంగా కృష్ణమూర్తి పేరును మాత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Next Story