- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking: కస్టడీ పూర్తి.. కోర్టుకు నందిగం సురేశ్
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Ycp Former Mp Nandigam Suresh)ను పోలీసులు కోర్టుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం(Tdp Office)పై దాడి చేసిన కేసులో ఆయనను పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించారు. కస్టడీ (Custody)ముగియడంతో ప్రస్తుతం నందిగం సురేశ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని సురేశ్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
కాగా వైసీపీ హయాంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లి టీడీపీ కార్యాలయం గేట్లు, అద్ధాలు ధ్వంసం చేశారు. అంతేకాదు అక్కడ పని చేస్తున్న పలువురు సిబ్బందిని సైతం గాయాపర్చారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో చర్యలు మొదలుపెట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే ఈ కేసులో మరింత విచారణ చేపట్టేందుకు నందిగంను కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. దీంతో రెండు రోజుల పాటు సురేశ్‌ను న్యాయమూర్తి కస్టడీకి ఇచ్చారు. ఇందులో భాగంగా నందిగంను ప్రశ్నించిన పోలీసులు.. కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.