మంత్రి ఇలాకాలో రైతులు కట కట.. సాగు నీరు లేక ఇక్కట్లు

by Jakkula Mamatha |   ( Updated:2025-02-08 15:22:41.0  )
మంత్రి ఇలాకాలో రైతులు కట కట.. సాగు నీరు లేక ఇక్కట్లు
X

దిశ,కాజులూరు: మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాజులూరు నెంబర్ -2 కాలువకు నీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు కు సాగు నీరు లేక పంటలు బీటలు వారుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ఇంజన్ల సహకారం తో నీరు తోడు కొంటున్నారు. వేలాది రూపాయిలు ఆయిల్ కోసం వెచ్చిస్తున్నారు. ఇదే పద్ధతి సాగితే పూర్తిగా నష్టాల బారిన పడుతామని రైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed