- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Train Accident: కాసేపట్లో రైలు ప్రమాద స్థలికి సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్: మరికాసేపట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు, అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలమండకు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక రైలులో కంటకాపల్లి ప్రమాద స్థలికి వెళ్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
కాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు, క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.