Target 2024: ఆక్వా రైతులకు మేనిఫెస్టో ప్రకటించిన Tdp

by Disha Web Desk 16 |
Target 2024: ఆక్వా రైతులకు మేనిఫెస్టో ప్రకటించిన Tdp
X

దిశ వెబ్ డెస్క్: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam)ని ఆదరిస్తే ఆక్వా రంగానికి అండగా ఉంటానని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం రైతుల సమస్యలపై సదస్సు జరిగింది. 'ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ'పేరుతో జరిగిన ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను సైతం చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ఆక్వా రైతులకు మ్యానిఫెస్టో ప్రకటించారు.

'ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. సోలార్ విండ్ తెచ్చి సబ్సిడీ ఇస్తాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. జగన్ రెడ్డి తన కమిషన్ వదులుకుంటే అన్నీ ఇవ్వొచ్చు. టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ పేరుతో ఆక్వా రైతులను బెదిరిస్తున్నారు. అధికారంలోకి రాగానే నీటిపన్ను, ఎఎంసి సెస్, టాన్స్ ఫార్మర్ల ధరను పాత రేట్లకే అందేలా చేస్తాం. 24 గంటల పాటూ కరెంట్ ఇస్తాం. డీజిల్ వాడకంతో ఆక్వా రైతులపై అదనపు భారం పడకుండా చూస్తాం. సోలార్, విండ్ ఎనర్జీని నాడే ప్రోత్సహించాం. జనరేటర్లు, డీజిల్ అవసరం లేని విధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఏరియేటర్లు, బోర్లు, మోటార్లు 50 శాతం సబ్సిడీపై ఇస్తాం' అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

సినీ హీరోలను సైతం బెదిరించిన వ్యక్తి జగన్

వైసీపీ ప్రభుత్వం (Ycp Governrment) అన్ని రంగాలను నాశనం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సినిమా రంగాన్ని బెదిరించడంతో రాష్ట్రంలో థియేటర్లు అన్నీ మూసివేశారని గుర్తుచేశారు. సినిమా హీరోలను కూడా బెదిరించిన వ్యక్తి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. 'సీఎంగా తన రికార్డును ఎవరైనా బ్రేక్ చెయ్యగలరా.?. ఎవరు చెప్పినా చెప్పకున్నా హైదరాబాద్‌ను అభివృద్ది చేసిన తృప్తి ఉంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిని జగన్ వేధిస్తున్నారు. కర్నూలు వెళ్లి మూడు రాజధానులు సాధ్యం కాదని అని తేల్చి వచ్చాను. కోర్టులో కేసుల ఫైల్‌ను కొట్టేసినందుకా కాకాణికి మంత్రి పదవి ఇచ్చింది.? ఇప్పుడు హైకోర్టు ఆ అంశంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. మంత్రి కాకాణితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయించాలి. జగన్ రాజీనామా చేయిస్తాడా...తనపైనా కేసులు ఉన్నాయని కదా అని ఊరుకుంటాడా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇవి కూడా చదవండి:

రాజీనామా చేసి పో.. సీఎం జగన్‌పై Chandrababu తీవ్ర ఆగ్రహం


Next Story

Most Viewed