లవర్‌కు సీరియస్‌గా ఉందని చెప్పి.. మైనర్‌పై లైంగికదాడి

by Disha Web |
లవర్‌కు సీరియస్‌గా ఉందని చెప్పి.. మైనర్‌పై లైంగికదాడి
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై రోజు రోజుకూ లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఓ చోట ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కామాంధులలో మార్పు రావడం లేదు. తాజాగా.. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వెంగళాయపాలెంకి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. అయితే , మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ ఓ యువకుడు పరిచయం అయ్యాడని, ఇద్దరూ ప్రేమించుకుంటునట్లు సమాచారం. నిన్న గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ లవర్‌కి సీరియస్ ఉందని చెప్పి ఆ బాలికను తీసుకొని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి తాగించారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. సాయంత్రానికి ఇంటికి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. వెంటనే బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసింది ప్రియుడా? గుర్తు తెలియని వ్యక్తుల తెలియాల్సి ఉంది.


Next Story