Cm Jagan చేతిలో సర్వే రిపోర్టు.. కాసేపట్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం

by Disha Web Desk 16 |
Cm Jagan చేతిలో సర్వే రిపోర్టు.. కాసేపట్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్‌లో వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై ఇప్పటికే సర్వేలు చేయించారు. గెలుపు, ఓటములపై రిపోర్టు కూడా తెప్పించుకున్నారు. ఈసారి గెలిచే నేతలతో పాటు ఓడిపోయే నేతల లిస్టు కూడా ఆయన దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో సీఎం జగన్ కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ ప్రజల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నేతలందరూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అయినా కొన్ని చోట్ల మిశ్రమ సందన కనిపిస్తోంది.

పార్టీ బలోపేతం సీఎం జగన్ ఫోకస్

దీంతో పార్టీ బలోపేతంపై సీఎం జగన్ దృష్టి సారించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏ మేరకు పట్టు ఉందనే అంశాలపై ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారా సర్వేలు చేయించారని తెలుస్తోంది. ఈ సర్వేలు కొంతమందికి నెగిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. వారందరి లిస్టును తయారు చేసి సీఎం జగన్ దగ్గర ఉంచుకున్నారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాల వల్ల నష్టం జరుగుతున్నట్లు కూడా తన దృష్టికి వచ్చినట్లు సమాచారం. అంతేకాదు పలువురు ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నట్లు లిస్టులో క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

కాసేపట్లో విస్తృతస్థాయి సమావేశం

ఈ మేరకు కాసేపట్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి నేతలకు సీఎం జగన్ క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. తాడేపల్లిలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల పని తీరుపై చర్చించనున్నారు. సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు. లాగే నియోజకవర్గాల్లో పట్టు తగ్గిపోయిన ఎమ్మెల్యేలను మార్చే సంకేతాలు కూడా ఈ సమావేశంలో ఇస్తారని అంటున్నారు. అసమ్మతి ఎదుర్కొంటున్న నాయకుల అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వెల్లవెత్తిన నేపథ్యంలో వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed