ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం

by Disha Web Desk 16 |
ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. లండన్ పర్యటన నుంచి మంగళవారం ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. అయితే తాజాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తాను లండన్ పర్యటనలో ఉండగా స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్, రిమాండ్ తదితర అంశాలపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు తరలించిన తర్వాత బంద్, రాష్ట్రంలో శాంతిభద్రతలు వంటి అంశాలపై డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భవిష్యత్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story