వైద్యాధికారి అరెస్టుకు కలెక్టర్ ఆదేశాలు…

దిశ వెబ్ డెస్క్:
నాదేండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ ను అరెస్టు చేయాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆదేశాలు జారీ చేశారు. నరసరావు పేటలో కరోనా తీవ్రతపై కలెక్టర్ శామ్యూల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కలెక్టర్ తీరుపై నాదేండ్ల వైద్యాధికారి సోమ్లానాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము క్షేత్ర స్థాయిలో కష్ట పడుతున్నామని సోమ్లానాయక్ అన్నారు. అలాంటి తమపై ఇలా మాట్లాడం సబబు కాదని కలెక్టర్ ను విర్శించారు. దీంతో వైద్యాధికారి తీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారిని అరెస్టు చేయాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆ వైద్యున్ని సస్పెండ్ చేయాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.