Gummanuru Jayaram: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్

by Disha Web Desk 1 |
Gummanuru Jayaram: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ.. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాజ్ భవన్ నుంచి గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ జయరాంను అడగడంతో ఆయన ససేమిరీ అన్నారు.

దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారని గమ్మనూరు జయరాం ఆరోపించరా. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. నేడు సాయంత్రం మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ గర్జన’ బహిరంగ సభ సందర్భంగా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.



Next Story

Most Viewed