పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విద్యార్థులకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. పదో తరగతిలో ఈ సంవత్సరం నుంచి ఎన్‌సీఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టారు. అందులో కేవలం తెలుగు సబ్జెక్ట్ మినహా అన్ని సబ్జెక్ట్‌లను(Subject) చేర్చారు. అయితే కొంత మంది విద్యార్థులు(students) హిందీ కష్టంగా ఉంటుందని అంటుంటారు. సౌత్ కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా హిందీ మాట్లాడతారని ఎన్‌సీఆర్‌టీలో హిందీ పాఠాలను పెట్టారు.

ఈ పాఠాలు మాతృభాష(Mother tongue) తెలుగు(Telugu) అయిన విద్యార్థులకు కష్టంగా ఉండటంతో నాలుగు పాఠాలను తొలగించారు. ఈ హిందీ పాఠాలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా టీచర్లకు బోధన చేయడానికి ఇబ్బందిగా ఉందని ప్రభుత్వానికి వినతులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు బోధించని పాఠాలను తొలగించారు. అవి పద్యభాగం(Poem)లో 7వ పాఠం, గద్యభాగంలో 11వ పాఠం, 12వ పాఠం, ఉపవాచకంలో 3వ పాఠం తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed