సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. సీఎం జగన్ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమానా.. ?.. ఆయన కంటే పెద్ద వాళ్లా అన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ దాడిపై పవన్ కల్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితమని సజ్జల కొట్టిపారేశారు.

Next Story

Most Viewed