ఆ పార్టీకి 50 శాతంలోపే ఓట్లు.. ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేసిన సజ్జల

by srinivas |
ఆ పార్టీకి 50 శాతంలోపే ఓట్లు.. ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేసిన సజ్జల
X

దిశ, వెబ్ డెస్క్: మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు కూడా రిలీజ్ అయ్యాయి. అటు అధికార వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిది అనే దానిపై సర్వేలు విడుదల అవుతున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా.. మరికొన్ని కూటమికి అనుకూలంగా సర్వేలు చెబుతున్నాయి. దీంతో సర్వేలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వంద శాతం గెలవబోతోందని చెప్పారు. 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేశామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కే పడతాయని చెప్పారు. ప్రజలపై ఆ నమ్మకం మాకు ఉందన్నారు. ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకి యాబై శాతం లోపే ఓట్లు వస్తాయని సజ్జల తెలిపారు.Next Story

Most Viewed