ఎన్నికల సంఘంపై ప్రభుత్వ సలహాదారు సీరియస్ కామెంట్స్

by GSrikanth |
ఎన్నికల సంఘంపై ప్రభుత్వ సలహాదారు సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ అధికారులు అంపైర్‌లాగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని ఆరోపించారు. అసలు ఈసీకి తెలియకుండా పిన్నెళ్లి వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కక్ష సాధింపు ధోరణిలో వెళ్లా్ల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ఉద్యోగులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

సీఎస్‌ను తప్పించాలని కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులను తమ దారికి తెచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. పాల్వాయి గేట్ పోలింగ్‌ బూత్‌ వీడియో అధికారిక వెబ్‌కాస్టింగ్ ద్వారా సేకరిస్తే అది ఎన్నికల సంఘం ప్రత్యేక ఆస్తి అవుతుందని, అది ఎలా లీక్ అయిందని సజ్జల ప్రశ్నించారు. వీడియో ప్రామాణికతను తనిఖీ చేయకుండా EC ఎందుకు అంత తొందరగా స్పందించిందని ప్రశ్నించారు. మాచర్ల నియోజక వర్గంలో మొత్తం 7 ఈవీఎం ధ్వంసం అయ్యాయని ఎన్నికల కమిషన్‌ అంగీకరించిన వాస్తవం అయితే, వాటన్నింటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా ఈసీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. వీడియోలు బయటకు రాకుండా అడ్డుకోవడం ద్వారా దోషులను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.



Next Story

Most Viewed