పకోడి సలహాలు మాకొద్దు : మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 21 |
పకోడి సలహాలు మాకొద్దు : మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో నటించే కొందరు పకోడిగాళ్లు తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా ఉండాలో నీతులు చెప్పే పకోడిగాళ్లు సినిమా నటులు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలని సూచించారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై కృష్ణజిల్లా కలెక్టర్ పి రాజబాబుని మాజీమంత్రి కొడాలి నాని కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్టాడారు.

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు మా గురించి మాట్లాడుతున్న పరిశ్రమలోని వ్యక్తులకు ఇస్తే బాగుంటుందన్న కొడాలి నాని హితవు పలికారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్ళు తమకు సలహాలిస్తున్నారని అదేదో ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరికి కూడా సలహాలు చెప్పొచ్చు కదా అంటూ చురకలంటించారు. సినిమా ఇండస్ట్రీలో డాన్సులు, ఫైట్‌లు గురించి సలహాలు ఇవ్వొచ్చు కదా అని కొడాలి నాని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సాయం చేసేందుకు పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించారని ఆరోపించారు.

జనసేన కాస్తా ఇప్పుడు టీడీపీకి భజన సేనగా మారిందని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌ ప్రజల దృష్టిలో జీరో అని వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల ఓడిపోయే సత్తా ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి బట్టలూడదీసి కొడతా..నడిరోడ్డుపై నిలబెడతా..గుండికొడతా...మోకాళ్ళపై నిలబెడతానని పవన్ కల్యాణ్ అంటున్నారని కానీ ఇప్పటి వరకు ఎవరికైనా గుండె కొట్టారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో గుండె కొట్టుకుంచుకున్న నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వద్ద మోకాళ్లపై నిలబడే నాయకుడు పవన్ కల్యాణ్ అని మాజీమంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.

Read More.. ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed